తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Paayal Rajput: బిగ్​బాస్​ 5పై క్లారిటీ - పాయల్ రాజ్​పుత్ బిగ్​బాస్ 5 క్లారిటీ

నటి పాయల్ రాజ్​పుత్(Paayal Rajput) తెలుగు బిగ్​బాస్​ సీజన్ 5(Big Boss Season 5)లో పాల్గొనబోతుందంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించిందీ ముద్దుగుమ్మ.

Paayal
పాయల్

By

Published : Jun 10, 2021, 7:22 PM IST

Updated : Jun 10, 2021, 7:52 PM IST

తెలుగు బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో నటి పాయల్‌ రాజ్‌పుత్‌(Paayal Rajput) పాల్గొనబోతోందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆ వార్తలకు ఆమె ట్విట్టర్ వేదికగా సమాధానం చెప్పింది. తాను తెలుగు బిగ్‌బాస్‌-5(Big Boss Season 5)లో పాల్గొనడం లేదంటూ స్పష్టం చేసింది. ఈ వార్తలన్నీ అవాస్తవాలేనని.. దయచేసి ఇలాంటి వార్తల్లోకి తనను లాగవద్దని ఆమె కోరింది.

2013లోనే తమిళ చిత్రం 'ఇరువార్‌ ఉల్లమ్‌'తో ఇండస్ట్రీకి పరిచయమైంది పాయల్. 'ఆర్‌ఎక్స్‌100' (RX 100) బోల్డ్‌ బ్యూటీగా కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత తెలుగులో వరుస చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. 'సీత', 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌', 'వెంకీ మామ', 'డిస్కోరాజా', 'ఏంజిల్‌' వంటి చిత్రాల్లో నటించిందీ చిన్నది‌. తెలుగుతో పాటు పంజాబీ, హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది. కాగా.. గతేడాది వచ్చిన బిగ్‌బాస్‌4లో ఆమె ఒక ప్రత్యేక గీతానికి చిందులేసింది.

ఇవీ చూడండి: రాశీఖన్నా డిజిటల్ ఎంట్రీ.. సైకో హంతకురాలిగా!

Last Updated : Jun 10, 2021, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details