బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా.. తన చిత్రాలు దక్షిణాది సినీపరిశ్రమల్లో రీమేక్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. భాష, సంస్కృతి, సరిహద్దులను అధిగమించే శక్తి సినిమాలకు ఉందని అభిప్రాయపడ్డాడీ హీరో.
ఆయుష్మాన్ హీరోగా నటించిన ఐదు చిత్రాలు దక్షిణాదిన తిరిగి రూపొందుతున్నాయి. 'అంధాధున్' రీమేక్‌ను తెలుగు, తమిళ భాషల్లో.. 'డ్రీమ్ గర్ల్'ను తెలుగులో.. 'విక్కీ డోనర్'ను తమిళంలో తెరకెక్కిస్తున్నారు. వీటితో పాటు ఆయుష్మాన్ 'ఆర్టికల్ 15'ను తమిళంలో.. 'బధాయి హో'ను తెలుగులో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
"నా సినిమాల్లో కొన్ని రీమేక్ అవ్వడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి సినిమాలకు నిజమైన పరీక్ష ఎదురుతోందని భావిస్తున్నా. భాష, సంస్కృతి, సరిహద్దులను దాటే శక్తి సినిమాలకు ఉందని నమ్ముతా. ప్రేక్షకులను అలరించడానికి నేను విభిన్న కథలను ఎంచుకుంటాను అనే దానికి ఇదే నిదర్శనం".