తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఓటీటీ' ఫ్లాట్​ఫామ్స్ వైపు నిర్మాతల చూపులు - Over 30 Producers said to release movie on OTT platforms

కరోనా లాక్​డౌన్​తో థియేటర్లు మూతపడటం వల్ల పలువురు నిర్మాతలు ఓటీటీల్లో, తమ చిత్రాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంపై 30 మందికి పైగా నిర్మాతలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.

Over 30 Producers released a note to release cinemas  on OTT platforms
'ఓటీటీ' దిశగా నిర్మాతల చూపులు

By

Published : Apr 28, 2020, 12:26 PM IST

ఓటీటీ వేదికగా చిత్రాలను విడుదల చేసేందుకు పలువురు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నిర్మాతలకు మేలు చేకూర్చుతుందని 30 మందికిపైగా ప్రొడ్యూసర్స్.. సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశారు.

"ఇటీవలే కరోనా సమస్యతో థియేటర్లు మూసివేశారు. ఇకపై ఎప్పుడు వాటిని తెరుస్తారో? రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కచ్చితమైన సమాచారం ఎవరికీ తెలియదు. దీంతో ఇప్పటికే రూ.కోట్లు వెచ్చించి చిత్రాలను తెరకెక్కించిన పలువురు నిర్మాతలు వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు" అని సదరు నిర్మాతలు ప్రస్తావించారు.

ఇప్పటికే జ్యోతిక నటించిన ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక నటుడు భారతిరాజా, త్యాగరాజన్‌, మురళీధరన్‌, టి.శివ, కె.రాజన్‌, జ్ఞానవేల్‌రాజా, మురళి, విజయకుమార్‌, చిత్రా లక్ష్మణన్‌, దురైరాజ్‌, ఫెఫ్సీ శివలతో పాటు 30 మందికిపైగా నిర్మాతలు ఓ బృందంగా ఈ ప్రకటన విడుదల చేశారు. పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి చిత్రాన్ని తెరకెక్కించే నిర్మాతకు.. ఆ సినిమాను పలు మార్గాల ద్వారా వ్యాపారం చేసుకునే హక్కు ఉందనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలని వారు కోరారు.

చిన్న, మధ్య తరహా బడ్జెట్‌ చిత్రాలను ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి ప్రయత్నించాలని ఈ సందర్భంగా సూచించారు. ఇలాంటి విషయాలను స్వాగతించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ బృందం నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ ప్రత్యేక బృందంగా పోటీచేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details