తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సైనాపై హీరో సిద్ధార్థ్ అసభ్యకర ట్వీట్.. జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం - సిద్ధార్థ్ ట్వీట్

Siddharth saina nehwal: షట్లర్ సైనాపై అసభ్యకర రీతిలో సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ఈ విషయమై జాతీయ మహిళా కమిషన్ ఫుల్ సీరియస్​గా ఉంది. అతడి ఖాతాను వెంటనే డిలీట్​ చేయాలని ట్విట్టర్​ ఇండియాకు లేఖ రాసింది.

Siddharth Saina Nehwal
సిద్ధార్థ్ సైనా నెహ్వాల్

By

Published : Jan 10, 2022, 3:38 PM IST

Updated : Jan 10, 2022, 6:02 PM IST

Siddharth tweet: హీరో సిద్ధార్థ్ వ్యవహార శైలిపై జాతీయ మహిళ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్​పై అతడు అభ్యంతర కామెంట్స్ చేశాడని, ఈ కేసులో మహారాష్ట్ర డీజీపీ విచారణ చేపట్టాలని మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు.

ఇంతకీ ఏం జరిగింది?

ఇటీవల పంజాబ్​ టూర్​లో ప్రధాని భద్రతా వైఫల్యం బయటపడింది. ఈ విషయమై సైనా నెహ్వాల్.. ప్రధాని భద్రతకే ముప్పు వాటిల్లితే అప్పుడు ఏ దేశం కూడా క్షేమంగా ఉండదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ జనవరి 5న ట్వీట్ చేసింది. ఈ ట్వీట్​కు రిప్లై ఇచ్చిన సిద్ధార్థ్.. సైనాపై అభ్యంతకర కామెంట్ చేశాడు.

సిద్ధార్థ్ ట్వీట్

తన ట్వీట్​పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిద్ధార్థ్, సోమవారం మరో ట్వీట్ చేశాడు. తను ఎలాంటి దురుద్దేశంతో కామెంట్​ చేయాలేదని అన్నాడు. అయితే సిద్ధార్థ్ ట్విట్టర్​ ఖాతాను తక్షణమే బ్లాక్ చేయాలని మహిళా కమిషన్ ఛైర్మన్.. ట్విట్టర్​ ఇండియా రెసిడెంట్ గ్రీవెన్స్​కు లేఖ రాశారు.

అలానే సిద్ధార్థ్ వ్యాఖ్యలపై షట్లర్ సైనా నెహ్వాల్ కూడా స్పందించారు. ఈటీవీ భారత్​తో ఫోన్​లో దాని గురించి మాట్లాడారు. సిద్ధార్థ్​ను నటుడిగా ఇష్టపడతానని, కానీ అతడి వ్యాఖ్యలు సరైన రీతిలో లేవని అన్నారు. సరైన పదాలు ఉపయోగించి మాట్లాడాల్సిందని చెప్పారు.

Last Updated : Jan 10, 2022, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details