OTT Tamil Bigboss: తమిళ ఓటీటీ 'బిగ్‌బాస్ అల్టిమేట్' షో వ్యాఖ్యాతగా ఇటీవల దిగ్గజ నటుడు కమల్‌హాసన్ తప్పుకున్నారు. లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో నటిస్తున్న 'విక్రమ్' సినిమాను పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కమల్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారా? అని బిగ్‌బాస్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'బిగ్‌బాస్' హోస్ట్‌గా హీరో శింబు! - తమిళ బిగ్‌బాస్ హోస్ట్ శింబు
OTT Tamil Bigboss: తమిళ ఓటీటీ బిగ్‌బాస్‌కు హీరో శింబు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు శరత్‌కుమార్, రమ్యకృష్ణ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
!['బిగ్‌బాస్' హోస్ట్‌గా హీరో శింబు! 'బిగ్‌బాస్' హోస్ట్‌గా హీరో శింబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14553165-thumbnail-3x2-bigboss-simbu.jpg)
అయితే, ఇకపై హీరో శింబు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై 'బిగ్‌బాస్' నిర్వాహకులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా, శరత్‌కుమార్, రమ్యకృష్ణ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. మరి ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరోవైపు తెలుగులోనూ 'బిగ్‌బాస్ నాన్‌స్టాప్'(ఓటీటీలో) ప్రారంభం కానుంది. దీనికి హీరో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చూడండి: Valimai twitter review: అజిత్ 'వలిమై' సోషల్‌మీడియా రివ్యూ