సినీ అభిమానుల్ని అలరించేందుకు ఓటీటీలో ఈ వారం(జులై 25-31) సరికొత్త సినిమాలు విడుదలకానున్నాయి. అందులో హిందీ చిత్రాలతో పాటు పలు సిరీస్‌లు ఉన్నాయి. ఇంతకీ అవేంటి? ఏ వేదికగా రిలీజ్ కానున్నాయో తెలుసుకుందాం.
నట్ఖత్..
ఈ షార్ట్ ఫిలిం జులై 24న విడుదలైంది. వూట్ సెలెక్ట్ వేదికగా రిలీజ్ చేశారు డైరెక్టర్ షాన్ వ్యాస్. విద్యా బాలన్, సనికా పటేల్, రాజు అర్జున్ నటించారు. ఓ తల్లి తన కొడుకుకు లింగ సమానత్వం గురించి వివరించే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
షురువాత్ కా ట్విస్ట్
ఈ షార్ట్ ఫిలిం జులై 25న వూట్ వేదికగా విడుదల కానుంది. నీనా గుప్త, ఛంకీ పాండే, లలిత్ బెల్ నటీనటులు. హీనా డిసౌజా, అవలోకిత దత్త్, ప్రవీణ్ ఫెర్నాండెజ్ దర్శకత్వం వహించారు. ట్విస్ట్‌లు జోడించి ఆరు కథలను కలిపి ఈ షార్ట్ ఫిలంగా రూపొందించారు.
లవ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కరోనా
వూట్ సెలక్ట్ వేదికగా జులై 27న విడుదల కానుంది. ఇంద్రానీ రే దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలింలో.. దిపన్నిత శర్మ, అదిల్ హుస్సేన్, శిబాని దండేకర్ నటించారు. ప్రపంచం మొత్తం తమ జీవితంలో ఏది ముఖ్యమో అన్వేషించే పనిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో సాగే కథ ఇది.
ఛత్రసాల్
ఈ వెబ్ సిరీస్ ఎమ్ ఎక్స్ ప్లేయర్ వేదికగా జులై 29న విడుదల కానుంది. అనాది చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో.. అశుతోష్ రానా, నీనా గుప్త, జితిన్ గులాతి నటించారు. బుందేల్‌ఖండ్ కోసం మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్‌తో యుద్ధం చేసిన మహారాజు ఛత్రసాల్ కథ ఇది.