తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌లలో సినిమాల కళకళ నెమ్మదిగా పెరుగుతోంది. దసరాకు ముందు, పండగ సందర్భంగా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వారం కూడా కొన్ని చిత్రాలు(ott this week india) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే, ఈసారి ఎక్కువగా చిన్న చిత్రాలు వస్తున్నాయి. ఓటీటీలోనూ ఇంకొన్ని సినిమాలు సందడి చేయటానికి సిద్ధమయ్యాయి. మరి అవేంటి? వాటి సంగతేంటి చూసేద్దామా!
వెండితెరపై భావోద్వేగాల 'నాట్యం'
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా పరిచయమవుతూ, సొంతంగా నిర్మిస్తున్న చిత్రం 'నాట్యం'(natyam movie). రేవంత్ కోరుకొండ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 22న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు వచ్చిన రామ్‌చరణ్ మాట్లాడుతూ.. కేవలం భరతనాట్యం గురించి మాత్రమే కాకుండా, అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉంటాయని, దాని కోసమైనా ఈ చిత్రం చూడాలని అన్నారు. కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మేనన్ తదితరులు నటించారు.
అసలేం జరిగింది అంటున్న శ్రీరామ్
యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'అసలేం జరిగింది'. శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్వీఆర్ దర్శకత్వం వహించగా, ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఓ అదృశ్య శక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రమని, 1970- 80ల్లో తెలంగాణలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠకు గురిచేస్తుందని పేర్కొంది.
'మధుర వైన్స్'లో మొదలైన ప్రేమకథ
నూతన నటీనటులు సన్నీ నవీన్, సీమా చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మధురవైన్స్'(madhura wines movie ott). యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జయకిషోర్ దర్శకత్వం వహించారు. అక్టోబరు 22న దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. మద్యానికి బానిసైన ఓ యువకుడు.. ఆ వాసన అంటేనే పడని ఓ యువతి. వీళ్లద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది. ఆ మద్యం కారణంగా వీళ్ల జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరి ఆ ప్రేమజంట శాశ్వతంగా విడిపోయిందా..? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'మధుర వైన్స్'.
ముగ్గురు అమ్మాయిల తలరాతలు 'హెడ్స్ అండ్ టేల్స్'
సునీల్, సుహాస్ చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'హెడ్స్ అండ్ టేల్స్'(heads and tales zee5). 'కలర్ ఫొటో' ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ 'జీ 5'లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేది ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.
క్రేజీ 'లవ్‌స్టోరీ' ఓటీటీలో..