OTT Bigboss show: ఇప్పటివరకూ బుల్లితెరపై అలరించిన తెలుగు రియాల్టీ షో 'బిగ్‌బాస్' ఇక ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. ఇప్పటికే డిస్నీ+హాట్‌స్టార్ ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో తాజాగా ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఫస్ట్‌లుక్' పేరుతో ఓ వీడియో నుంచి పంచుకుంది.
బిగ్‌బాస్ ఓటీటీ.. ఈసారి ఎంతమంది పాల్గొననున్నారంటే? - ఓటీటీ బిగ్‌బాస్ షో
OTT Bigboss show: 'బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఫస్ట్‌లుక్' పేరుతో ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది డిస్నీ+హాట్‌స్టార్. ఇందులో కొత్త బిగ్‌బాస్ హౌస్‌ను కూడా చూపించారు. మొత్తం ఎంత మంది పోటీదారులు పాల్గొనబోతున్నారంటే?

బిగ్‌బాస్
షో ప్రారంభోత్సవానికి సంబంధించిన ఈవెంట్స్ పూర్తయినట్లు ఈ వీడియోలో తెలుస్తోంది. అంతేకాదు, బిగ్‌బాస్ కొత్త హౌస్‌ను కూడా ఇందులో చూపించారు. మొత్తం 18మంది పోటీదారులు ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’లో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఈ షో ప్రసారం కానుంది. కాగా, ఇటీవలే ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇదీ చూడండి: ఓటీటీ 'బిగ్‌బాస్' ప్రోమో అదిరిందిగా!
Last Updated : Feb 19, 2022, 2:58 PM IST