Oscars 2022: 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో అనూహ్య ఘటన జరిగింది. కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించాడు స్టార్ హీరో విల్‌స్మిత్. తన భార్య జడా పింకెట్ స్మిత్‌పై అతడు జోక్ వేయడమే అందుకు కారణం. గుండుతో ఉన్న జడాను 'జి.ఐ జేన్' సినిమా సీక్వెల్లో చూడాలనుకుంటున్నట్లు క్రిస్ జోక్ చేశాడు. (ఆ సినిమాలో ప్రధాన పాత్రధారి గుండుతో కనిపిస్తారు).
ఈ జోక్ పట్ల తొలుత స్మిత్ నవ్వేసి ఊరుకున్నాడు. అయితే అతడి భార్య జడా పింకెట్ మాత్రం అందుకు బాధపడింది. దీంతో స్టేజ్ మీదకు వెళ్లి.. క్రిస్ చెంప పగలగొట్టాడు స్మిత్. అనంతరం కిందకి వచ్చి కూర్చుకున్న తర్వాత.. "నా భార్య గురించి మాట్లాడకు" అంటూ హెచ్చరించాడు. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.