Oscars 2022: ఆస్కార్ 2022, 94వ ఎడిషన్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో హోస్ట్‌గా ఈ సారి ముగ్గురిని నియమించారు. వాండా సైక్స్, అమీ షుమెర్, రెజీనా హాల్‌లను ఎంపిక చేశారు. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని 'గుడ్ మార్నింగ్ అమెరికా' తెలిపింది. మార్చి 27న ఈ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది.
Oscars 2022: ఆస్కార్ హోస్ట్‌గా రెజీనా! - ఆస్కార్ 2022 హోస్ట్
Oscars 2022: ఈ సారి ఆస్కార్ 94వ ఎడిషన్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమానికి ముగ్గురు హోస్టులుగా వ్యవహరించనున్నారు. వాండా సైక్స్, అమీ షుమెర్, రెజీనా హాల్‌లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి ముగ్గురు హోస్ట్‌లు ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తి నెలకొన్న అంశం. అయితే.. ముగ్గురు షిఫ్ట్‌ల వారీగా హోస్ట్ విధులు నిర్వహిస్తారని సమాచారం. గత ఏడాది అవార్డ్స్ కార్యక్రమాన్ని కరోనా కారణంగా పరిమిత సంఖ్యతో నిర్వహించారు. దీంతో అత్యంత తక్కువ రేటింగ్ వచ్చింది. ఒమిక్రాన్ ప్రభావం తగ్గిన కారణంగా ఈ సారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ముగ్గురు హోస్ట్లను ఎంపిక చేశారు. ఇందులో వాండా సైక్స్, అమీ షుమెర్ కామిక్‌లో పేరు పొందినవారు.
ఇదీ చదవండి:ప్రియమణి 'భామాకలాపం' ఆకట్టుకుందా?