కరోనా వ్యాప్తి కారణంగా ఈసారి ఆస్కార్ అకాడమీ పురస్కారాల వేడుక జరగదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఈవెంట్‌ను వర్చువల్‌గా జరపమని నిర్వాహకులు ధ్రువీకరించారు. 'ఇన్-పర్సన్ టెలికాస్ట్' పద్ధతిని అనుసరిస్తామని అకాడమీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.
అయితే మహమ్మారి కారణంగా ఈ సారి ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కొంత ఆలస్యంగా.. 2021 ఏప్రిల్ 25న నిర్వహించాలని అకాడమీ ఆఫ్ మోషన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిర్ణయించింది. ఈ పురస్కారాల వేడుకను కొంత ఆలస్యంగా నిర్వహించడం ద్వారా థియేటర్లు తెరచుకుని ఎక్కువ సినిమాలు విడుదలవ్వడానికి వీలు కలుగుతుందని అకాడమీ అభిప్రాయపడింది. దీంతో ఈ వేడుకకు ఎక్కువగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఎప్పటిలాగే వేడుక జరిగేలా అకాడమీ దృష్టి సారించింది.