తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉత్తమ సహాయ నటిగా ప్రియాంకకు ఆస్కార్! - priyanka news updates

బాలీవుడ్​ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఈ ఏడాది ఆస్కార్​ అవార్డును సొంతం చేసుకునే అవకాశం ఉందని ఓ ప్రచురణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఆమె 'ది వైట్​ టైగర్'​ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతోనే ఉత్తమ సహాయనటిగా అవార్డును దక్కించుకోవచ్చని తెలిపింది.

Oscars 2020
ఆస్కార్​ 2020

By

Published : Sep 20, 2020, 12:58 PM IST

బాలీవుడ్​ ప్రముఖ హీరోయిన్​ ప్రియాంకా చోప్రా ఉత్తమ సహాయ నటి విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కించుకునే అవకాశం ఉందని ఓ ప్రచురణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న 'ది వైట్​ టైగర్'​ నెట్​ఫ్లిక్స్​ సినిమాకు ఈ ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డును సొంతం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.

రాబోయే ఆస్కార్​ అవార్డును దక్కించుకోనున్న వారిని అంచనా వేస్తుంటుంది ఈ ప్రచురణ సంస్థ. ఈ క్రమంలోనే జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో ప్రియాంకతో పాటు, మెరిల్​ స్ట్రీప్​(ది ప్రోమ్​) హాన్​ యెన్​-రి(మినారి), క్రిస్టిన్​ స్కాట్​ థామస్​(రెబెకా) ఒలీవియా కొల్మన్​(ది ఫాదర్​)లు ఉన్నారు.

రామిన్​ బహ్రానీ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. అరవింద్​ అడిగా నవల 'ది వైట్ టైగర్' ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక ముందెన్నడూ కనిపించని పాత్రలో అలరించనుంది. ఆమె ఎగ్జిక్యూటివ్​ ప్రొడ్యూసర్​గానూ వ్యవహరిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details