తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆస్కార్ అవార్డు గ్రహీత ఎన్నియొ మృతి

ఇటాలియన్​ ప్రముఖ సంగీత దర్శకుడు ఎన్నియొ మొర్రికోన్​(91) జులై 6న మృతిచెందారు. ఇటీవల నడుము విరిగి ఓ ఆస్పత్రిలో చేరి, అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

By

Published : Jul 6, 2020, 7:57 PM IST

Ennio Morricone
ఎన్నియో మొర్రికోన్

ఆస్కార్​ అవార్డు గ్రహీత, ఇటాలియన్ ప్రముఖ ​సంగీత దర్శకుడు ఎన్నియొ మొర్రికోన్(91) జులై 6న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆ దేశ స్థానిక వార్తా సంస్థ స్పష్టం చేసింది. అయితే ఏ కారణంతో మృతి చెందారో వెల్లడించలేదు.

ఇటీవల కిందపడి నడుము విరగడం వల్ల ఆయన, ఆస్పత్రిలో చేరారని​ సదరు వార్త సంస్థ ప్రచురించింది. ఆ చికిత్సలో భాగంగా అక్కడ ఉండగానే ప్రాణాలు విడిచినట్లు వెల్లడించింది.

'వన్స్​ అపాన్​ ఏ టైమ్ ఇన్ ది వెస్ట్​', 'సినిమా ప్యారాడిసో'​ హాలీవుడ్​ సినిమాలకు సంగీతమందించి ఈయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నియొ స్వరాలు అందించిన 'ది మిషన్​', 'డేస్​ ఆఫ్​ హెవెన్'​, 'బగ్సీ', 'మలెనా', 'ది హేట్​ఫుల్​ ఎయిట్'​ సినిమాలకు ఆరు ఆస్కార్ ​ నామినేషన్లు అందుకున్నాయి. మొత్తంగా ఆయన కెరీర్​లో 500సినిమాలకు బాణీలు సమకూర్చారు.

ఎన్నియో మొర్రికోన్

ఇది చూడండి : 'నెపోటిజమ్​.. సమయాన్ని వృథా చేసే అంశం'

ABOUT THE AUTHOR

...view details