తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పారాసైట్'కు ఆస్కార్ అవార్డుల​ పంట - best direction award

92వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లో సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఉత్తమ చిత్ర విభాగంలో దక్షిణకొరియాకు చెందిన 'పారాసైట్'​ ఆస్కార్​ దక్కించుకుంది. బోంగ్​ జూన్​ హో ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. మరికొన్ని విభాగాల్లోనూ ఈ చిత్రం పురస్కారాలు అందుకుంది.

Oscar: 'Parasite' for Best Picture
Oscar: 'Parasite' for Best Picture

By

Published : Feb 10, 2020, 11:00 AM IST

Updated : Feb 29, 2020, 8:27 PM IST

లాస్​ ఏంజిల్స్​​ వేదికగా ఈ ఏడాది ఆస్కార్​ అవార్డుల ప్రదానోత్సవం అగంరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పారాసైట్(దక్షిణకొరియా) ఉత్తమ చిత్ర విభాగంలో పురస్కారం సొంతం చేసుకుంది. బోంగ్​ జూన్​ హో ఈ సినిమాను తెరకెక్కించాడు. సాంగ్​ కాంగ్​ హో , లీ సన్​ కూన్​, చాయ్​ వూ షిక్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.

ఆస్కార్​ అవార్డు బరిలో దిగిన ఈ సినిమా.. అనేక విభాగాల్లో పురస్కారాలను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ కథా చిత్రంగా అవార్డు అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన 'బోంగ్​ జూన్​ హో' ఉత్తమ దర్శకుడిగానూ ఆస్కార్​ దక్కించుకున్నాడు. బెస్ట్​ ఒరిజినల్​ స్ర్కీన్​ ప్లే విభాగంలోనూ బోంగ్​ జూన్​ హో, హేన్​ జిన్​ వోన్​ జోడీ అవార్డు అందుకుంది. వీటితో పాటు పలు విభాగాల్లో నామినేషన్లలోనూ నిలిచింది.

పోటీలో నిలిచిన విభాగాలు...

  • ప్రొడక్షన్​ డిజైన్​: లీ హ జన్​​​, సెట్​ డెకరేషన్​: చో వోన్​ వో
  • ఫిల్మ్​ ఎడిటింగ్​: యాంగ్​ జిన్మో

.

Last Updated : Feb 29, 2020, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details