యావత్ సినీ ప్రపంచం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే అకాడమీ అవార్డు(ఆస్కార్)లకు పలు చిత్రాలు నామినేట్ అయ్యాయి. 93వ అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన చిత్రాల జాబితాను ప్రియాంక చోప్రా, ఆమె భర్త గాయకుడు నిక్ జోన్స్ ప్రకటించారు. అత్యధికంగా నెట్‌ఫ్లిక్స్ ‘మ్యాంక్’ చిత్రం 10 విభాగాల్లో నామినేట్ అయింది. తొలిసారి ఇద్దరు మహిళా డైరెక్టర్లు క్లోవీ చావ్, ఎమరాల్డ్ ఫెన్నల్‌లు ఉత్తమ దర్శకుల కేటగిరీలో నామినేట్ అయ్యారు. అంతర్జాతీయ చిత్రాల కేటగిరీలో తమిళ చిత్రం ‘సూరారై పోట్రు’(ఆకాశం నీ హద్దురా) ప్రదర్శితమైనా తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. ప్రియాంక చోప్రా నటించిన ‘వైట్ టైగర్’కు అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో నామినేషన్ దక్కించుకుంది.
2021 ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలు ఇవే
ఉత్తమ చిత్రం
- ది ఫాదర్
- జుడాస్ అండ్ బ్లాక్ మిస్సయా
- మ్యాంక్
- మినారి
- నో మ్యాడ్ ల్యాండ్
- ప్రామిసింగ్ యంగ్ ఉమెన్
- సౌండ్ ఆఫ్ మెటల్
- ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7