తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆస్కార్​: ఉత్తమ సహాయ నటుడు 'బ్రాడ్​ పిట్'​ - laura dern

ఈ ఏడాది ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్​ సొంతం చేసుకున్నాడు బ్రాడ్​ పిట్​. వన్స్​ అప్​ ఆన్​ ఏ టైమ్​ ఇన్​ హాలీవుడ్ చిత్రంలో నటనకు గానూ ఈ పురస్కారం లభించింది. మరోవైపు ఉత్తమ సహాయ నటిగా లౌరా డెర్న్​ అవార్డు దక్కించుకుంది.

Oscar: Brad Pitt Best Supporting Actor
ఆస్కార్​: ఉత్తమ సహాయ నటుడు 'బ్రాడ్​ పిట్'​

By

Published : Feb 10, 2020, 8:54 AM IST

Updated : Feb 29, 2020, 8:07 PM IST

లాస్​ ఏంజిలెస్ వేదికగా మొదలైన ఆస్కార్​ వేడుకల్లో ఉత్తమ సహాయ నటుడిగా బ్రాడ్​ పిట్​ అవార్డు అందుకున్నాడు. 'వన్స్​ అప్​ ఆన్​ ఏ టైమ్​ ఇన్​ హాలీవుడ్'​ చిత్రంలో నటనకు ఈ పురస్కారం లభించింది. గతంలోనూ బెస్ట్​ పిక్షర్​ విభాగంలో బ్రాడ్ పిట్​ ఆస్కార్​ సొంతం చేసుకున్నాడు. 12 ఇయర్స్​ ఏ స్లేవ్​ మూవీకి ఇతడే నిర్మాత.

ఉత్తమ సహాయ నటి ఎవరంటే?

ఈ ఏడాది ఉత్తమ సహాయ నటి విభాగంలో లౌరా డెర్న్​ అవార్డు దక్కించుకుంది. మ్యారేజ్​ స్టోరీ చిత్రంలో నటనకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.

నామినేషన్లలో పోటీపడిన వాళ్లు...

  • కేథీ బేట్స్​- రిచర్డ్​ జ్యూవెల్
  • స్కార్లెట్​ జాన్సన్​- జోజో రాబిట్​
  • ఫ్లోరెన్స్​ ప్లంగ్​- లిటిల్​ ఉమెన్​
  • మార్గట్​ రాబీ - బాంబ్​ షెల్​
Last Updated : Feb 29, 2020, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details