తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆస్కార్‌ విజేతలు వీరే.. 'పారాసైట్'​కు అవార్డుల మోత - Oscar 2020 winners

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు 'ఆస్కార్‌' ప్రదానోత్సవం లాస్‌ ఏంజిలెస్​లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. 92వ ఆస్కార్​​ అవార్డుల వేడుకలో భాగంగా పలు విభాగాల్లో సినిమాలకు పురస్కారాలను ప్రకటించింది అకాడమీ (అకాడమీ ఆఫ్​ మోషన్​ పిక్చర్​ ఆర్ట్స్​ అండ్​ సైన్సెస్​). ఉత్తమ చిత్రంగా 'పారాసైట్'​ నిలవగా.. ఉత్తమ నటుడిగా జోక్విన్‌ ఫోనిక్స్‌ (జోకర్​) ఉత్తమ నటిగా (రెనీ జెల్​వెగర్) ఆస్కార్​లు సొంతం చేసుకున్నారు.

Oscar 2020 winners
ఈ ఏడాది ఆస్కార్‌ విజేతలు వీరే

By

Published : Feb 10, 2020, 11:16 AM IST

Updated : Feb 29, 2020, 8:29 PM IST

అంగరంగ వైభవంగా ఆస్కార్​ వేడుక

92వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం.. లాస్‌ ఏంజిలెస్​లోని డాల్బీ థియేటర్​లో సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ హాలీవుడ్‌ తారాగణమంతా హాజరయ్యారు. 'జోకర్‌' సినిమా హీరో జోక్విన్​ ఫోనిక్స్​ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.

'వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌' సినిమాలో ప్రదర్శనకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కించుకున్నాడు బ్రాడ్ పిట్. ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా 'టాయ్‌స్టోరీ-4', బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లేకు గాను బాంగ్‌ జాన్‌ హో (పారాసైట్‌), బెస్ట్‌ లైవ్‌యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా.. 'ద నైబర్స్‌ విండో' నిలిచాయి. ఉత్తమ స్క్రీన్‌ప్లే 'తైకా వెయిటిటి' (జోజో రాబిట్‌)కు దక్కింది.

ఉత్తమ నటుడు: జాక్విన్‌ ఫోనిక్స్‌(జోకర్‌)
ఉత్తమ నటి: రెనీ జెల్​వెగర్​(జ్యూడీ)

అవార్డుల జాబితా...

  • ఉత్తమ చిత్రం: పారాసైట్​
  • ఉత్తమ నటుడు: జాక్విన్‌ ఫోనిక్స్‌ (జోకర్‌)
  • ఉత్తమ నటి: రెనీ జెల్​వెగర్ ​(జ్యూడీ)
  • ఉత్తమ దర్శకుడు: బాంగ్​ జూన్‌ హో (పారాసైట్‌)
  • ఉత్తమ సంగీతం: జోకర్‌ (హిల్దార్‌)
  • మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: బాంబ్‌ షెల్‌
  • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పారాసైట్‌ (దక్షిణ కొరియా)
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: 1917 (రోచ్‌రాన్‌, గ్రెగ్‌ బట్లర్‌, డోమినిక్‌ తువే)
  • ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ (మైఖేల్‌ మెక్‌సుకర్‌, ఆండ్రూ బక్‌ల్యాండ్‌
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: 1917 (రోజర్‌ డికెన్స్‌)
  • ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌: ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ (డొనాల్డ్‌ సిల్వెస్టర్‌)
  • ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌: 1917 (మార్క్‌ టేలర్‌, స్టువర్ట్‌ విల్సన్‌)
  • ఉత్తమ సహాయనటి: లారా డ్రెన్‌ (మ్యారేజ్‌ స్టోరీ)
  • ఉత్తమ సహాయ నటుడు: బ్రాడ్‌ పిట్‌ (వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌)
  • ఉత్తమ యానిమేషన్‌ చిత్రం: టాయ్‌ స్టోరీ4
  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: బాంగ్‌ జూన్‌ హో (పారాసైట్‌)
  • ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: హెయిర్‌ లవ్‌
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: తైకా వెయిటిటి (జోజో ర్యాబిట్‌)
  • ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ది నైబర్స్‌ విండో
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: జాక్వెలిన్‌ దురన్‌ (లిటిల్‌ ఉమెన్‌)
  • ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్‌): అమెరికన్‌ ఫ్యాక్టరీ
  • ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ ఫిల్మ్​): లెర్నింగ్​ టూ స్కేట్​బోర్డ్​ ఇన్​ ఏ వార్​జోన్​ (ఇఫ్​ యూ ఆర్​ ఏ గర్ల్​)​
  • బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్​: (ఐ యామ్​ గొన్నా) లవ్​ మీ ఎగేన్​ - రాకెట్​మ్యాన్​
    ఉత్తమ దర్శకుడు: బాంగ్​ జూన్‌ హో (పారాసైట్‌)
Last Updated : Feb 29, 2020, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details