OO Antava Song Choreographer Vijay : కోరికలు, ఆశయాలు ఉంటే సరిపోదు.. వాటిని సాధించాలనే పట్టుదల ఉండాలి. ఎదురయ్యే కష్టాల్ని అధిగమిస్తూ.. అనుభవాలుగా మలుచుకోగలగాలి. అనుకోకుండా వచ్చే అవకాశాల్ని ఒడుపుగా అందిపుచ్చుకునే నేర్పూ తెలిసుండాలి. అప్పుడే విజయం దరి చేరుతుంది. అందుకు నిదర్శనమే.. శ్రీకాకుళానికి చెందిన పొలాకి విజయ్. చిన్నప్పడే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. బతకుదెరువు కోసం భాగ్యనగరం వచ్చి మేస్త్రీగా కష్టం చిందించాడు. అయితేనేం.. ఇప్పుడు తనకో స్థాయి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి ప్రముఖ హీరోతో అదిరిపోయే స్టెప్పులేయించే కొరియోగ్రాఫర్ అనే ప్రత్యేక గుర్తింపూ దక్కింది. ఇప్పటికే 30కిపైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసి.. సరికొత్త నృత్య రీతులతో ప్రేక్షకులను మెప్పిస్తున్న విజయ్ సినీ ప్రయాణమేంటో.. అతని మాటల్లోనే...
OO Antava Song Choreographer Vijay : 'డ్యాన్స్ చూడగానే.. అల్లు అర్జున్ అదరగొట్టావ్ బ్రదర్ అన్నారు' - nakkileesu golusu song choreographer
OO Antava Song Choreographer Vijay : 'ఊ.. అంటావా మామా.. ఊ..ఊ.. అంటావా', 'నాదీ నక్కిలిసు గొలుసు' వంటి మాస్ పాటలకు కొరియోగ్రఫీ చేసి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని గెలుచుకున్నారు కొరియోగ్రఫర్ పొలాకి విజయ్. కానీ అతను కూడా సగటు యువకుడిలానే ఎన్నో కోరికలు, ఆశయాలతో పల్లె నుంచి పట్నం బాట పట్టి.. పూటగడవని స్థితి నుంచి.. ప్రముఖ హీరోలు, హీరోయిన్లతో స్టెప్పులేయించే స్థాయికి ఎదిగారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు.. మరెన్నో అనుభవాలు ఎదుర్కొన్నారు. మేస్త్రీగా పనిచేసి ఇప్పుడు టాలీవుడ్ క్వీన్ సమంతతో మెస్మరైజింగ్ డ్యాన్స్ చేయించిన విజయ గురించి అతని మాటల్లోనే..
OO Antava Song Choreographer Vijay