తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR movie: రాజమౌళితోనే అది సాధ్యమైంది- హీరో రామ్​చరణ్

RRR ram charan: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించిన తర్వాత చాలా కొత్త విషయాలు తెలుసుకున్నానని ప్రముఖ కథానాయకుడు రామ్​చరణ్ అన్నారు. డైరెక్టర్ రాజమౌళిపైనా ప్రశంసలు కురిపించారు.

Ram Charan
రామ్​చరణ్

By

Published : Dec 26, 2021, 5:12 PM IST

Updated : Dec 26, 2021, 5:19 PM IST

Ram charan Rajamoui: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో తను నటించడానికి ప్రధాన కారణం దర్శకుడు రాజమౌళి అని కథా'నాయకుడు రామ్​చరణ్ చెప్పారు. బిగ్​స్క్రీన్​పై ఇద్దరు హీరోలు కలిసినటించిన సినిమాలు మెల్లగా అంతరించిపోతున్న సమయంలో తమ చిత్రం వస్తుందని అన్నారు.

రామ్​చరణ్, ఎన్టీఆర్.. 'ఆర్ఆర్ఆర్'లో హీరోలుగా నటించారు. వచ్చే జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చరణ్ వెల్లడించారు.

రామ్​చరణ్-రాజమౌళి-ఎన్టీఆర్

"ఈ సినిమా నేను ఎస్​ చెప్పడానికి ప్రధాన కారణం డైరెక్టర్ రాజమౌళి. ఈ స్టోరీ విని చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇద్దరు స్టార్స్ ఓ సినిమాలో నటించడమే సాధ్యమే. గతంలో బాలీవుడ్, దక్షిణాదిలో చాలా సినిమాలు చూశాం. కానీ కారణాలేంటో తెలియవు గానీ కొంతకాలానికి అవి ఆగిపోయాయి. బహుశా బడ్జెట్​ సమస్యలేమో! అయితే రాజమౌళి సినిమాతో ఇప్పుడు అది సాధ్యమైంది" అని రామ్​చరణ్ అన్నారు.

Ntr Ramcharan: 2007లో 'చిరుత'తో ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ఎన్టీఆర్ వచ్చిన ఆరేళ్ల తర్వాత హీరోగా పరిచయమయ్యారు. ఇన్నేళ్ల కాలంలో వీరిద్దరూ స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడం సహా విశేషా ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు.

'ఆర్ఆర్ఆర్' టీమ్

దర్శకుడు రాజమౌళితో చరణ్​ 'మగధీర' లాంటి ఇండస్ట్రీ హిట్​ అందుకోగా.. ఎన్టీఆర్..​ 'స్టూడెంట్ నం.1', 'సింహాద్రి', 'యమదొంగ' లాంటి బ్లాస్​బస్టర్​లు సొంతం చేసుకున్నారు.

"భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో రాజమౌళి. 'బాహుబలి' సినిమాతో దానిని నిరూపించారు. అలాంటి డైరెక్టర్​తో పనిచేయడం వల్ల నా పని సులభమైంది. అలానే నా 13 ఏళ్ల కెరీర్​ కంటే ఈ సినిమాలో చాలా పరిణతితో నటించాను. 'ఆర్ఆర్ఆర్'తో చాలా కొత్త విషయాలూ తెలుసుకున్నాను" అని చరణ్ చెప్పారు.

అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్

RRR movie: ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో 'ఆర్ఆర్ఆర్' నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు పలు విదేశీ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 26, 2021, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details