తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్.​ఆర్.​ఆర్'కు ఏడాది పూర్తి... రేపు కీలక ప్రకటన - It's been a phenomenal year since the shoot of #RRR began

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'. అగ్రహీరోలు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. ఆలియా భట్‌ ఓ కథానాయిక. బుధవారం(నవంబర్​ 20న) ఈ సినిమాకు చెందిన కీలక ప్రకటన వెల్లడించనుంది చిత్రబృందం.

'ఆర్.​ఆర్.​ఆర్' చిత్రీకరణకు ఏడాది...రేపు కీలక ప్రకటన

By

Published : Nov 19, 2019, 7:23 PM IST

మల్టీస్టారర్​గా ఎన్టీఆర్​, రామ్​చరణ్​ కలిసి నటిస్తోన్న చిత్రం 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి బుధవారం(నవంబర్​ 19న) కీలక అప్​డేట్​ రానుంది. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమై నేటితో ఏడాది కాగా... షూటింగ్​ 70 శాతం పూర్తయినట్లు చిత్రయూనిట్​ వెల్లడించింది. ఈ సందర్భంగా సినిమాలోని కథానాయికలు, నటీనటలు వివరాలు వెల్లడించనున్నాడు జక్కన్న.

ఇప్పటికే రామ్​చరణ్​ సరసన ఆలియా భట్‌ కథానాయికగా ఎంపికైంది. అల్లూరిగా చరణ్‌‌, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నాడు. బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్‌ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిన తర్వాత ఆమె పాత్రలో సరిపోయే నటి కోసం దర్శక, నిర్మాతలు చూస్తున్నారు. నిత్యా మేనన్‌ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

తారక్​తో జక్కన్న
ఆలియా భట్​

ప్రభాస్​కూ అవకాశం...!

ఈ సినిమాలో ప్రభాస్‌ కూడా సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో అల్లూరి, కొమరం పాత్రల్ని వెండితెరపై ఆయన వాయిస్‌ ఓవర్‌తోనే పరిచయం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇందులోని ఓ పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్నాడట. ఈ వదంతులు నిజమైతే.. జక్కన్న, ప్రభాస్‌ అభిమానులకు ఇది ట్రీట్‌ అని చెప్పొచ్చు. ఒకే సినిమాలో తారక్‌, చరణ్‌, ప్రభాస్‌ కనిపించడం కూడా విశేషం.

ఇదే సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో కనిపించన్నాడు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని... వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details