కథ నచ్చితే యువ కథానాయకుల చిత్రాల్లో నటించే అగ్ర హీరోల్లో బాలకృష్ణ ఒకరు. గతంలో మంచు మనోజ్‌తో కలిసి 'ఊ.. కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రంలో నటించి మెప్పించారు. ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమాలో బాలయ్య ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత, బాలకృష్ణ సన్నిహితుడు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. త్వరలోనే బాలయ్యకు కథ వినిపించబోతున్నారని తెలుస్తోంది.
మరో యంగ్హీరోతో కలిసి నటించనున్న బాలయ్య! - యంగ్ హీరో సినిమాలో నటించినున్న బాలయ్య
నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి యువకథానాయకుడితో కలిసి నటించనున్నారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఆయన సన్నిహితుడైన ఓ ప్రముఖ నిర్మాత తీసుకొచ్చిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
మరో యంగ్హీరోతో కలిసి నటించనున్న బాలయ్య!
అయితే ఈసారి బాలయ్య ఊ కొడతారా (ఓకే చెప్తారా) లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. 'సింహా', 'లెజెండ్' చిత్రాలకు మించిన అంచనాలతో రాబోతుంది. మిర్యాల రవీందర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయేషా సైగల్ నాయిక. మరో నాయికగా పూర్ణ ఎంపికైందని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Last Updated : Nov 15, 2020, 8:54 PM IST