డార్లింగ్ ప్రభాస్ మంచి మనసు చాటుకున్నారు. సంక్రాంతి సందర్భంగా 'రాధేశ్యామ్' చిత్రబృందంలోని పలువురికి ఖరీదైన వాచ్లను బహుమతిగా ఇచ్చారు. ఆ వాచ్ ఫొటో ప్రస్తుతం వైరల్గా మారాయి.
హైదరాబాద్లోనే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. హీరోయిన్ పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన చిత్రీకరణ శనివారంతో పూర్తయింది. ఈ విషయాన్ని ఆమెనే వెల్లడించింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే థియేటర్లలో 'రాధేశ్యామ్' విడుదల కానుంది.