తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గానకోకిల లతా మంగేష్కర్ మౌనవ్రతం చేసిన వేళ.. ఎందుకంటే? - lata mangeshkar songs

Lata mangeshkar songs: ఎన్నో వేల పాటలు పాడిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్.. కెరీర్​ పీక్ స్టేజ్​లో కొన్నాళ్లు మౌనవ్రతం చేశారు. ఇంతకీ ఎందుకంటే?

lata mangeshkar
లతా మంగేష్కర్

By

Published : Feb 6, 2022, 7:09 PM IST

Lata mangeshkar news: వేలాది పాటలతో సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్న గాయని లతా మంగేష్కర్‌ మృతి తీరని లోటును మిగిల్చింది. అనితర సాధ్యమైన రీతిలో ఆమె ఎన్నో వేల పాటలను ఆలపించారు. అయితే, 1960వ దశకంలో మాత్రం కొన్ని నెలల పాటు ఆమె పాటలకు దూరంగా ఉన్నారు. అంతేకాదు, అనేక రోజులు మౌనవత్రాన్ని ఆచరించారు. దీని వెనుక కారణాన్ని ఆమె సోదరుడు హృదయనాథ్‌ మంగేష్కర్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

లతా మంగేష్కర్

1960 నాటికే కొన్ని వందల పాటలను ఆలపించిన లతా మంగేష్కర్‌కు గొంతు సంబంధిత సమస్య ఎదురైంది. ముఖ్యంగా స్వరం పెంచి పాడాల్సిన పాటలను ఎక్కువగా ఆమె పాడుతుండటం వల్ల స్వరపేటికలో సమస్య ఏర్పడింది. దీంతో ఏ పాట పాడినా అనుకున్న రీతిలో వచ్చేది కాదు. పైగా లతాజీ కూడా బాగా ఇబ్బంది పడేవారట. ఇదే విషయాన్ని ప్రముఖ గాయకుడు ఉస్తాద్‌ ఆమీర్‌ ఖాన్‌కు చెబితే సమస్య పరిష్కారమయ్యే వరకూ ఎలాంటి పాటలూ పాడవద్దని సూచించారట. ఆ సమయంలో లతా మంగేష్కర్‌ కెరీర్‌ అత్యున్నత స్థాయిలో ఉంది. అయినా కూడా ఉస్తాద్‌ సూచన మేరకు 'మౌనవ్రతం' ఆచరించటం మొదలు పెట్టిన ఆమె కొన్ని నెలల పాటు ఏ గీతాన్ని ఆలపించలేదు. 2010లో ఇండోర్‌లో నిర్వహించిన 'మై ఔర్‌ దీదీ' కార్యక్రమంలో హృదయనాథ్‌ ఈ విషయాన్ని పంచుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details