ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా.. లక్షలమందిని బలితీసుకుంటోంది. అయితే ఈ వైరస్ను ఆధారంగా చేసుకుని టాలీవుడ్లో సినిమాలు తీసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ, రామ్గోపాల్ వర్మ.. ఇలాంటి కథలో చిత్రాలు రూపొందిస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్లను ఇప్పటికే విడుదల చేశారు.
తాజాగా ఈ వైరస్ నేపథ్య కథాంశంతో 'డబ్ల్యుహెచ్ఓ' అనే మరో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో 'పలాస 1978' ఫేమ్ రక్షిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. గురువారం అతడి పుట్టినరోజు సందర్భంగా చిత్రానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. 'ఐ యామ్ గోనా టెల్ గాడ్ ఎవ్రీథింగ్' అనే వైవిధ్యమైన హాలీవుడ్ షార్ట్ ఫిలింతో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన దేవ్ పిన్నమరాజు.. దీనితో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.