కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. 'ఆర్‌ఆర్‌ఆర్'లో తారక్ సరసన నటించే హీరోయిన్ ఎవరా? అని అంతకన్నా ఎక్కువ ఆసక్తి చూపారు. అయితే ఎవరి ఊహకు అందకుండా హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ పేరు ప్రకటించాడు దర్శకుడు రాజమౌళి.
ఒక్క రోజులోనే రికార్డు సెట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' భామ - గూగుల్ ఇండియా ట్రెండింగ్
'ఆర్ఆర్ఆర్' సినిమాలో తారక్ సరసన హీరోయిన్గా ఎంపికైన ఒలీవియా మోరిస్.. 'గూగుల్ ఇండియా' ట్రెండింగ్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.
ఒలీవియా మోరిస్
సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటో కనపడగానే ఎవరీ అమ్మాయి? అని వెతకడం ప్రారంభించారు. ఈమెనే జెన్నీఫర్ పాత్రలో ఎన్టీఆర్‌కు జోడీగా నటించబోయే భామ అనే ఒకే ఒక్క ప్రకటనతో ఒక్క రోజులోనే రికార్డు సృష్టించింది. కొన్ని గంటల్లోనే ఈమె కోసం రెండు లక్షల మందికి పైగా గూగుల్‌లో వెతికారు. ఈ కారణంతో 'గూగుల్ ఇండియా' ట్రెండింగ్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం తన ట్విట్టర్లో పేర్కొంది.
ఇది చదవండి: అంతర్జాతీయ స్టార్స్‌తో 'ఆర్ఆర్ఆర్' హంగామా