తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమెరికాలో ఓ బేబీకి మిలియన్ డాలర్ల వసూళ్లు

సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ఓ బేబీ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. అమెరికాలో మిలియన్ డాలర్ల కలెక్షన్లు అందుకుని అందిరినీ ఆశ్చర్యపరిచింది.

By

Published : Jul 25, 2019, 6:30 AM IST

సమంత

అమెరికాలో తెలుగు సినిమాలకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఇంతకు ముందు వసూళ్ల పరంగా అక్కడ వెనుకంజలో ఉండేవి తెలుగు సినిమాలు. స్టార్​ హీరోల చిత్రాలే మిలయన్ డాలర్లు వసూలు చేయడం అరుదు. అలాంటిది సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ఓ బేబీ చిత్రం మిలియన్ డాలర్లను వసూల్ చేసి ఆశ్చర్యపరిచింది.

మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది ఓ బేబీ. యూఎఎస్​లో మిలియన్ రావడం పట్ల చిత్రబృందం సంబరాలు చేసుకుటోంది. స్టార్ హీరోలకు సవాల్​ విసిరే ఈ ఘనతను సమంత సోలోగా కొట్టి చూపించింది.

విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగానూ మంచి వసూళ్లతో దూసుకుపోతోందీ చిత్రం. నందినిరెడ్డి దర్శకత్వంలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం సమకూర్చాడు.

ఇది చదవండి: దిల్లీలోనూ 'సూపర్​ 30' సినిమాకు ట్యాక్స్​ లేదు

ABOUT THE AUTHOR

...view details