తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మిస్టర్​ బీన్​ రియల్​ లైఫ్​లో పైలట్ అయినప్పుడు... - mr.bean

మిస్టర్​ బీన్ ఫేమ్ ఇంగ్లీషు నటుడు రోవన్ అట్కిన్​సన్ ఓ సాహసమే చేశాడు. విమాన ప్రయాణంలో పైలట్ కళ్లు తిరిగి పడిపోతే అతడు కోలుకునే వరకు ఫ్లైట్​ను కంట్రోల్​ చేశాడు మన బీన్​.

బీన్

By

Published : May 16, 2019, 5:09 PM IST

Updated : May 16, 2019, 6:19 PM IST

రోవన్ అట్కిన్​సన్​ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. మిస్టర్​ బీన్​ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు చాలామంది. తన హాస్యంతో అంతగా పాపులర్​ అయ్యాడు. తెరమీద నవ్వులు పూయించే అట్కిన్​సన్ నిజ జీవితంలో ఓ సాహసం చేశాడు. కుటుంబంతో కలిసి విమాన ప్రయాణం చేస్తున్న మన బీన్ పైలట్​ స్పృహ కోల్పోతే విమానం నడిపి ఆశ్చర్యానికి గురిచేశాడు. అనేక మంది ప్రాణాలు కాపాడాడు. నిజానికి అట్కిన్​సన్​కు ఫ్లైట్​ నడపడం రాదంట!

2001 మార్చిలో కుటుంబంతో కలిసి హాలీడేకు కెన్యా పయనమయ్యాడు మన బీన్. ఆనందంగా సాగుతున్న ప్రయాణంలో పైలట్​ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. ఆకాశంలో విమానం రివ్వుమని పోతోంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పైలట్​ను పక్కకు జరిపి ఫ్లైట్​ను కంట్రోల్​ చేశాడు బీన్. కాసేపటికి పైలట్ కోలుకుని విమానాన్ని నైరోబీలోని విల్సన్​ విమాశ్రయంలో దింపాడు.

విమానం నడపడం రాకపోయినా ఆపద సమయంలో తన వంతు ప్రయత్నం చేసి అందరి మన్ననలు పొందాడు అట్కిన్​సన్​. మిస్టర్ బీన్ సిరీస్​తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

Last Updated : May 16, 2019, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details