తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఓ మై గాడ్​ డాడీ' పూర్తి పాట వచ్చేసింది - ఓ మై గాడ్​ డాడీ

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఇందులోని అన్ని పాటలకు విశేషాదరణ దక్కింది. తాజాగా ఈ సినిమాలోని 'ఓ మై గాడ్​ డాడీ' పాట పూర్తి వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

O MY GOD DADDY full video song from ALA..VAIKUNTAPURAMLO
వీడియో సాంగ్​: ఓ మై గాడ్​ డాడీ.. దట్​ విల్​ మేక్​ మీ శాడీ

By

Published : Feb 24, 2020, 10:35 AM IST

Updated : Mar 2, 2020, 9:19 AM IST

అల్లు అర్జున్​ - త్రివిక్రమ్​ కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తాచాటింది. ఇందులోని 'ఓ మై గాడ్​ డాడీ' పాటకు అల్లుఅర్జున్​ కుమారుడు అయాన్​, కుమార్తె అర్హ కలిసి ప్రోమోలో కనువిందు చేశారు. వెస్ట్రన్​ మ్యూజిక్​తో ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంటుందీ పాట. తాజాగా ఈ సాంగ్ పూర్తి వీడియోను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.

'అల వైకుంఠపురములో' చిత్రంలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్​ కథానాయికలు. సీనియర్ నటి టబు ఈ చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. సుశాంత్​, జయరామ్​, మురళీశర్మ, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్​, రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.

ఇదీ చూడండి.. 'సామజవరగమన' పూర్తి వీడియో వచ్చేసిందోచ్​

Last Updated : Mar 2, 2020, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details