యువకథానాయకుడు రామ్ నటిస్తున్న 'రెడ్' సినిమాలోని 'నువ్వే నువ్వే' పాట మేకింగ్ వీడియోను ఈరోజు విడుదల చేశారు. ఇటలీలోని అందమైన మంచుకొండల్లో రామ్-మాళవిక శర్మ మధ్య దీనిని చిత్రీకరించారు. రొమాంటిక్ మూడ్‌లో ఉన్న మణిశర్మ సంగీతం.. చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.
మంచుకొండల్లో రామ్ రొమాంటిక్ పాట - రామ్ రెడ్ సినిమా
'రెడ్'లోని నువ్వే నువ్వే పాట మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. లాక్డౌన్ ముగిసిన తర్వాత సినిమా విడుదలపై స్పష్టత రానుంది.
నువ్వే నువ్వే పాట మేకింగ్ వీడియో
తమిళ థ్రిల్లర్ 'తడమ్'కు రీమేక్‌గా 'రెడ్'ను రూపొందిస్తున్నారు. ముందుగా అనుకున్నట్లు ఏప్రిల్ 9నే ప్రేక్షకుల ముందుకు రావాలి ఈ సినిమా. అయితే లాక్డౌన్ ప్రభావంతో షూటింగ్ నిలిచిపోయి విడుదల ఆలస్యమైంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా, స్రవంతి రవికిశోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.