తెలంగాణ

telangana

'నువ్వేకావాలి' మరోసారి చూడాలంటే?

By

Published : Oct 13, 2020, 6:18 AM IST

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్​లో, తరుణ్​ హీరోగా కె. విజయ్​ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా 'నువ్వే కావాలి'. ఈ చిత్రం విడుదలై నేటితో (అక్టోబర్ 13) 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు ఈ చిత్రాన్ని ఈటీవీ ప్రసారం చేయనుంది.

Nuvve kavali Movie has completed 20 Years
'నువ్వేకావాలి' మరోసారి చూడాలంటే?

హీరో తరుణ్‌, రిచా జంటగా కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'నువ్వే కావాలి'. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ఈ చిత్రం నేటితో (అక్టోబరు 13) 20 వసంతాలు పూర్తి చేసుకుంది. తరుణ్‌-రిచాల నటన, విజయ్‌ భాస్కర్‌ టేకింగ్‌, త్రివిక్రమ్‌ రచనా శైలితో పాటు, సంగీత దర్శకుడు కోటి అందించిన స్వరాలు యువతనే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'నువ్వే కావాలి' చిత్రానికి 20 ఏళ్లు పూర్తి

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఆ సినిమా జ్ఞాపకాలను మళ్లీ ప్రేక్షకులు గుర్తుచేసుకోవడానికి మంగళవారం ఉదయం 9 గంటలకు 'నువ్వే కావాలి' చిత్రాన్ని ఈటీవీ ప్రసారం చేయనుంది.

ఈటీవీలో ప్రసారం కానున్న 'నువ్వే కావాలి' చిత్రం

ABOUT THE AUTHOR

...view details