తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తొలిసారిగా ఎంపీ.. వెంటనే శ్రీమతి హోదా - మిమీ చక్రవర్తి

తొలిసారి లోక్​సభకు ఎంపికైన నటి నూస్రత్ జహన్.. పారిశ్రామికవేత్త నిఖిల్​ను టర్కీలో వివాహం చేసుకున్నారు. ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

తొలిసారిగా ఎంపీ.. వెంటనే శ్రీమతి హోదా

By

Published : Jun 20, 2019, 9:19 AM IST

ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ ఎంపీ నూస్రత్ జహన్... కోల్​కతాకు చెందిన పారిశ్రామిక వేత్త నిఖిల్ జైన్​ను పెళ్లాడారు. టర్కీలోని బోడ్రమ్ నగరంలో జరిగిన బీచ్​ వెడ్డింగ్​లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఆ ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అదే రాష్ట్రానికి చెందిన నటి, ఎంపీ మిమీ చక్రవర్తి ఈ వివాహానికి హాజరయ్యారు.

తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఈ ఇద్దరు నటీమణులు తొలిసారి ఎంపీలుగా ఎన్నికయ్యారు. సోమవారం నుంచే తొలి లోక్​సభ సెషన్ ప్రారంభమైంది. ఈ పెళ్లి కారణంగా వీరిద్దరూ ఆ సమావేశాలకు హాజరు కాలేకపోయారు.

ఇది చదవండి: నటి నుంచి నేతగా మిమీ చక్రవర్తి

ABOUT THE AUTHOR

...view details