'లవర్స్ డే' సినిమాతో ప్రియా వారియర్ ఎంత గుర్తింపు తెచ్చుకుందో.. విడుదల తర్వాత నూరిన్కూ అంతే పేరు వచ్చింది. ఇప్పుడు నూరిన్ కథానాయికగా నటిస్తున్న చిత్రం ఉల్లాలా ఉల్లాలా. ఈ సినిమా ద్వారా తెలుగులో అరంగేట్రం చేయనుందీ మలయాళీ భామ.
రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రీకరణ దాదాపుగా పూర్తికావొచ్చిన ఈ చిత్రానికి సీనియర్ నటుడు సత్యప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నాడు.