యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత తారక్-త్రివిక్రమ్ కాంబోలో సినిమా రూపొందనుందని హారికా, హాసిని క్రియేషన్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ 13 నెలల క్రితమే ప్రకటించింది.
అయితే, ఇన్ని నెలలు గడిచినా ఈ ప్రాజెక్టుపై ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల సినిమా పట్టాలెక్కుతుందా? లేదా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్లో ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్ర అప్డేట్ కావాలంటూ #వేకప్ఎన్టీఆర్30టీమ్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.