హిందీ సినీ నటి స్వరా భాస్కర్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నాలుగేళ్ల ఓ బాల నటుడిని అసభ్య పదజాలంతో దూషించడమే ఇందుకు కారణం. తాజాగా సామాజిక మాధ్యమాల్లో #Swara_aunty ట్యాగ్‌తో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ హ్యాష్‌ట్యాగ్ నేడు ట్విట్టర్లో ట్రెండింగ్‌లో నిలిచింది.
ఏమైంది..?
టీవీలో ఓ 'చాట్ షో'కు హాజరైన స్వర.. తనకు గతంలో జరిగిన ఓ అనుభవాన్ని చెప్పింది. సినిమా చిత్రీకరణ సమయంలో 4ఏళ్ల బాల నటుడు ఆమెను 'ఆంటీ' అని పిలిచాడని చెప్తూ... ఆ చిన్నారిని వేదికపైనే తిట్టింది. చిన్నారి గురించి వాడిన పదాలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.