తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పాన్ ఇండియా స్థాయిలో మహేశ్-త్రివిక్రమ్ చిత్రం - మహేశ్​ కొత్త చిత్రం

సూపర్​స్టార్ మహేశ్​ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. తాజాగా సోమవారం ప్రిన్స్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నిర్మాత నాగవంశీ.

SSMB28 movie
మహేశ్​ కొత్త చిత్రం

By

Published : Aug 10, 2021, 9:52 AM IST

సూపర్​స్టార్ మహేశ్ బాబు 27వ సినిమా 'సర్కారు వారి పాట' చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పుడే తన కొత్త మూవీకి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ప్రిన్స్ 28వ సినిమాను ఈ నవంబర్​ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రొడ్యూసర్ నాగ వంశీ తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్న యాక్షన్ జోనర్​ మూవీని గత ఐదేళ్ల క్రితమే సెట్స్​పైకి తీసుకురావాలనుకున్నట్లు చెప్పారు. ఇప్పటికి వీలు కుదిరిందని వెల్లడించారు.

"అతడు, ఖలేజా కల్ట్​ క్లాసిక్స్. వాటి కంటే ఇంకా మెరుగ్గా ఈ సినిమా తీయాలనుకుంటున్నాం. ఇదొక యాక్షన్ ఎంటర్​టైనర్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తాం. నవంబర్​లో షూటింగ్ ప్రారంభిస్తాం. ఇండస్ట్రీ హిట్​తో వచ్చే ఏడాది మహేశ్ పుట్టినరోజు వేడుకల్లో కలుద్దాం."

-నాగ వంశీ, నిర్మాత

సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బర్త్​ డేతో 46వ పడిలోకి అడుగుపెట్టారు ప్రిన్స్. అతడి పుట్టిన రోజును అభిమానులు సోషల్ మీడియాలో సంబరంగా జరుపుకొన్నారు.

ఇదీ చదవండి:రాజమౌళితో ప్రాజెక్ట్‌పై సూపర్‌స్టార్‌ ఏమన్నారంటే..?

'సర్కారు వారి పాట' బ్లాస్టర్.. మహేశ్ లుక్స్ అదుర్స్

ABOUT THE AUTHOR

...view details