తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్ జ్ఞాపకార్థంగా లక్షకుపైగా మొక్కలు

తన సోదరుడు సుశాంత్ సింగ్ జ్ఞాపకార్థంగా ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్వేతా సింగ్. ఆ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

#Plants4SSR: More than one lakh trees in remembrance of Sushant
Sushant singh

By

Published : Sep 14, 2020, 1:36 PM IST

Updated : Sep 14, 2020, 2:23 PM IST

బాలీవుడ్​ యువహీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారిస్తోంది. మరోవైపు అతడి సోదరి శ్వేతా సింగ్, సుశాంత్ జ్ఞాపకార్థంగా 'ప్లాంట్స్​4ఎస్ఎస్ఆర్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా అభిమానులందరూ లక్షకుపైగా మొక్కల్ని నాటనున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను శ్వేత ట్వీట్ చేశారు.

జూన్ 14న ముంబయి బాంద్రాలోని తన సొంత ఫ్లాట్​లో ఉరి వేసుకుని చనిపోయాడు సుశాంత్. దీనికి నెపోటిజమ్​ అని తొలుత ఆరోపణలు వచ్చాయి కానీ తర్వాత ప్రేయసి రియా చక్రవర్తే అతడి మృతికి కారణమంటూ నటుడి తండ్రి కేసు పెట్టారు. అనంతరం కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

Last Updated : Sep 14, 2020, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details