విద్యార్థులతో ప్రిన్స్ మహేశ్ ముచ్చట్లు
‘మహర్షి’ సినిమా విజయంతో సూపర్‌స్టార్ మహేష్‌బాబు మంచి జోష్ మీదున్నాడు. వరుస ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్న ఆయన... గురువారం రైతులతో ముచ్చటించారు. అనంతరం స్కూలు విద్యార్థులతోనూ సరదాగా గడిపారు.
స్కూలు పిల్లలతో ప్రిన్స్ ముచ్చట్లు
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను గురువారం సాయంత్రం హీరో మహేశ్‌బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి సందర్శించారు. అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఇదే స్కూలు నుంచి వంశీ తన పాఠశాల విద్యను అభ్యసించారు. చదువుకున్న పాఠశాలలోనే పిల్లలతో సరదాగా గడపడం ఆనందాన్నిచ్చిందని పేర్కొంటూ ఫొటోలను షేర్ చేశారు వంశీ పైడిపల్లి.