కరోనా ప్రభావంతో తెలుగు సినీ కార్మికులంతా తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి తాత్కాలికమేనని చెబుతూ సినీకార్మికుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఆయన నేతృత్వంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) ద్వారా మూడో విడత నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
కరోనా కష్టం తాత్కాలికమే: చిరంజీవి - కరోనా క్రైసిస్ ఛారిటీ
సినీ కార్మికులు కరోనా వల్ల ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పిన అగ్రహీరో చిరంజీవి.. ఆయన ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ద్వారా మరో 10 వేల మందికి నిత్యావసర సరకులను అందించనున్నట్లు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి
హైదరాబాద్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని 10 వేల మంది సినీ కార్మికులకు మూడో విడత సరకులు అందజేసినట్లు చిరు వెల్లడించారు. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్లో సమావేశమైన సీసీసీ కమిటీ... మూడో విడతలో ఇప్పటికే 6 వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపింది. చిత్రపరిశ్రమ పూర్తిగా కొలుకునేంతవరకు సరకులు అందజేసేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.
Last Updated : Aug 21, 2020, 3:47 PM IST