తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​ సర్​ప్రైజ్​ వీడియోపై అనేక సందేహాలు! - ఆర్​ఆర్​ఆర్​ అప్​డేట్​

'ఆర్​ఆర్​ఆర్​' సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న వీడియో అనేక సందేహాలకు దారి తీస్తుంది. అందులో అల్లూరి పాత్ర పోలీస్​ గెటప్​లో కనిపించడమే అందుకు కారణం.

#BheemforRajaraju: Ramcharan Birthday surprise video from RRR leaves many doubts
'ఆర్​ఆర్​ఆర్'​ సర్​ప్రైజ్​ వీడియోపై అనేక సందేహాలు!

By

Published : Mar 28, 2020, 2:55 PM IST

Updated : Mar 28, 2020, 3:26 PM IST

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రేక్షకుల నుంచి విశేషాదరణ పొందగా.. మరోవైపు అనేక సందేహాలను మిగిల్చింది. అల్లూరి రామరాజుకు వీడియోలో చరణ్ లుక్​కు చరిత్రతో పోలిక లేకుండా సాగింది. ఆయుధాలపై, యుద్ధవిద్యలపై అపారమైన పట్టు ఉన్న వీరుడిగా చెర్రీ పాత్రను పరిచయం చేశారు. అంతే కాకుండా అతడు పోలీస్​ గెటప్​లో కనిపించటం మరో విశేషం. అయితే ఆ గెటప్​ పథకంలో భాగంగా వేసుకున్నాడా లేక పోలీస్​ గెటప్​లోనే నటిస్తున్నాడా అనేది అసలు ప్రశ్న.

అల్లూరి పాత్రను పరిచయం చేసిన కొమురం భీమ్ వీడియోలో అల్లూరిని అన్నగా సంబోధించాడు. అల్లూరి.. భీమ్​కి అన్న ఎలా అయ్యాడు అనేది అస్పష్టం. ఇక కేవలం వారు పుట్టిన తేదీల ఆధారంగా అల్లూరిని అన్నగా, భీమ్​ని తమ్ముడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు కావొచ్చు. చరిత్ర చూస్తే అల్లూరి 1897-1924 కాలంలో జీవించినట్లు ఆధారాలుండగా.. కొమురం భీమ్ 1901లో పుట్టారు. ఈ సినిమా ఫిక్షనల్ స్టోరీ అని జక్కన్న ముందుగానే చెప్పడం వల్ల దీనిపై లాజిక్స్ వెతికే అవకాశం లేకపోయింది.

ఇదీ చూడండి.. ట్విట్టర్​లో 'మన్నెం దొర'కు విశేష స్పందన

Last Updated : Mar 28, 2020, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details