తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నాలో అభిమానిని తట్టిలేపింది మీరే' - బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన బాలయ్యు

టాలీవుడ్​ అగ్రకథానాయకుడు బాలకృష్ణ నేడు 60వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నందమూరి నటవారసులు ఎన్టీఆర్​, కల్యాణ్​రామ్​ శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు సోషల్​మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుతున్నారు.

ntr
ఎన్టీఆర్​

By

Published : Jun 10, 2020, 9:27 AM IST

Updated : Jun 10, 2020, 9:50 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ నేడు 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నందమూరి వారసులు జూనియర్​ ఎన్టీఆర్​, కల్యాణ్​రామ్​ కూడా తమదైన రీతిలో బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా తమకున్న అభిమానాన్ని, ప్రేమను తెలిపారు.

నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే అంటూ.. బాలకృష్ణ గురించి ట్వీట్​ చేశారు ఎన్టీఆర్​.

"మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను. 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్​."

- కల్యాణ్​రామ్​, కథానాయకుడు.

శ్రీకాంత్​, నారారోహిత్​, అల్లరినరేశ్, సనీల్​​ సహా పలువురు నటులు, నిర్మాతలు, దర్శకులు బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇది చూడండి : అలసట తెలియని యోధుడు.. ఈ నందమూరి అందగాడు

ఇది చూడండి : 'తను నన్ను బాలా అని పిలుస్తాడు'

Last Updated : Jun 10, 2020, 9:50 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details