'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. తర్వాత ఏ సినిమా చేస్తారనేది ఇంతవరకు వెల్లడించలేదు. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నింటికీ సోమవారం సాయంత్రం క్లారిటీ రాబోతుంది.
ఎన్టీఆర్ కొత్త సినిమా అప్డేట్.. దర్శకుడు ఎవరు? - ఎన్టీఆర్ త్రివిక్రమ్
సోమవారం(ఏప్రిల్ 12) సాయంత్రం ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే దర్శకుడు ఎవరై ఉంటారా అని ఫ్యాన్స్ తెగ మాట్లాడుకుంటున్నారు.
ఎన్టీఆర్ కొత్త సినిమా అప్డేట్.. దర్శకుడు ఎవరు?
ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా చేయనున్నారని, గతేడాది అధికారికంగా ప్రకటించారు. కానీ త్రివిక్రమ్, మహేశ్‌తో కలిసి పనిచేయనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో తారక్‌ను డైరెక్ట్ చేయబోయేది ఎవరా అని ఆయన అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
అయితే తారక్‌తో తర్వాత సినిమా కొరటాలనే చేస్తారని దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈయన కాకపోతే 'ఉప్పెన' అలరించిన బుచ్చిబాబుతో ఎన్టీఆర్ పనిచేసే అవకాశముంది.