తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చెక్​' చిత్రబృందానికి జూ.ఎన్టీఆర్ విషెస్ - Check movie latest news

రిలీజ్​కు సిద్ధమైన 'చెక్' బృందానికి అగ్రకథానాయకుడు జూ.ఎన్టీఆర్ విషెస్ చెప్పారు. ఈ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడ్డ ఖైదీ పాత్ర పోషించారు.

NTR wishes Nithiin and Chandrasekhar Yeleti on Check movie release
'చెక్​' చిత్రబృందానికి జూ.ఎన్టీఆర్ విషెస్

By

Published : Feb 25, 2021, 5:13 PM IST

నితిన్ నటించిన థ్రిల్ల్రర్ 'చెక్' సినిమా విడుదలకు సిద్ధమైంది. శుక్రవారం(ఫిబ్రవరి 26) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతూ జూ.ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దర్శకుడు చంద్రశేఖర్​ యేలేటిని ప్రతిభపై ప్రశంసలు కురిపించారు.

"చందు(చంద్రశేఖర్ యేలేటి) తెరకెక్కించే కథాంశాలు, స్టోరీ టెల్లింగ్​కు నేను అభిమానిని. 'చెక్' కూడా అలానే కనిపిస్తోంది. రేపు సినిమా విడుదల కానున్న సందర్భంగా చందు, నితిన్​తో పాటు చిత్రబృందానికి ఆల్​ ది బెస్ట్" అని తారక్ రాసుకొచ్చారు.

జైలు డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నితిన్ ఖైదీలా నటించారు. ప్రియా ప్రకాశ్ వారియన్ అతడి ప్రేయసిగా, రకుల్ ప్రీత్ న్యాయవాది పాత్రలు పోషించారు. కల్యాణి మాలిక్ సంగీతమందించారు. భవ్య క్రియేషన్స్​పై ఆనంద్​ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్..​ ప్రేక్షకుల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

ఇది చదవండి:'మోసగాళ్లు' ట్రైలర్.. లిరికల్ గీతంతో సాయిపల్లవి

ABOUT THE AUTHOR

...view details