తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యంగ్ టైగర్ పుట్టినరోజున ఫ్యాన్స్​కు డబుల్ ట్రీట్! - NTR trivikram Movie Firstlook on NTR birthday

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. 'ఆర్​ఆర్ఆర్' నుంచి టీజర్​తో పాటు త్రివిక్రమ్​తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా టైటిల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

NTR NTR
NTR

By

Published : Apr 17, 2020, 5:31 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ తన పుట్టినరోజు కానుకగా సినీప్రియులకు డబుల్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి చిత్రసీమ వర్గాలు. ప్రస్తుతం తారక్‌-చరణ్‌.. రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నటిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌ తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో షురూ చేయనున్నారు. మే 20న తన పుట్టినరోజు పురస్కరించుకుని ఈ రెండు చిత్రాల నుంచి అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే రామ్‌చరణ్‌ పుట్టినరోజు కానుకగా 'భీమ్‌ ఫర్‌ అల్లూరి' పేరుతో చరణ్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది 'ఆర్‌ఆర్‌ఆర్‌' బృందం. ఇప్పుడు తారక్‌ జన్మదిన కానుకగా 'అల్లూరి ఫర్‌ భీమ్‌' పేరుతో ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే డబ్బింగ్‌ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఇక అదే రోజు ఎన్టీఆర్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్​లో తెరకెక్కబోయే చిత్ర టైటిల్‌ పోస్టర్‌నూ విడుదల చేసే అవకాశమున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details