జూ.ఎన్టీఆర్.. త్వరలో ఓ టీజర్‌తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' నుంచి మరో టీజర్ ఏమైనా వస్తుందా అని ఆనందపడొద్దు. తన సోదరుడు కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'బింబిసార'. దీనికే కోసం తారక్ తన గొంతు అరువివ్వనున్నారు.
NTR: కల్యాణ్‌రామ్ సినిమా కోసం తారక్! - kalyan ram bhimbisara movie
నందమూరి కల్యాణ్‌రామ్ 'బింబిసార' టీజర్ త్వరలో రానుండగా, అందులో ఓ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసింది చిత్రబృందం. అసలు దాంతో ఎన్టీఆర్‌కు ఉన్న సంబంధమేంటి?
ఎన్టీఆర్
పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కుతున్న 'బింబిసార'.. చాలావరకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇందులో కల్యాణ్‌రామ్.. టైటిల్ రోల్ పోషిస్తున్నారు. వశిష్ట్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా రూపొందిస్తున్నారు. త్వరలో విడుదల చేయనున్న టీజర్లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
Last Updated : Jun 8, 2021, 6:16 AM IST