'అరవింద సమేత' తర్వాత ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభానికీ ముహూర్తం ఖరారైంది. దసరాకి చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంబంధించిన కథని పూర్తి చేశారు.
దసరాకే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ షురూ - NTR-TRIVIKRAM MOVIE SHOOTING DATE FIX
త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కనున్న సినిమా చిత్రీకరణ ముహూర్తం ఖరారైంది. దసరాకు చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు.
ఎన్టీఆర్
'అల వైకుంఠపురములో' విడుదలైన తర్వాత నుంచి ఆయన ఎన్టీఆర్ చిత్రంపైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్‌ఆర్'లో నటిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోయే చిత్రం కోసం రంగంలోకి దిగుతారు. ఎన్టీఆర్ నటించబోయే 30వ చిత్రమిది. ఎస్.రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.
ఇది చూడండి : సోనూసూద్‌పై అభిమాని అద్భుత స్కెచ్
Last Updated : Jun 11, 2020, 7:31 AM IST