స్టార్ హీరో ఎన్టీఆర్‌కు కార్లంటే(NTR Car Collection) ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆయన గ్యారేజ్‌లో రకరకాల కార్లు దర్శనమిస్తాయి. ఇటీవలే తన గ్యారేజ్‌లోకి మరో కారు(NTR Lamborghini) అడుగుపెట్టింది. విలాసవంతమైన స్పోర్ట్స్ కార్లకు కేరాఫ్ అయిన లాంబొర్గిని (Lamborghini urus Graphite Capsule) కారును తారక్ ఇటీవల కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ కారు నంబరు(NTR Car Number) గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది.
ఈ కారు కోసం TS09 FS 9999 నంబర్‌ను(NTR Car Number Plate) హీరో జూనియర్ ఎన్టీఆర్ వేలంలో సొంతం చేశారని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయ అధికారి ఒకరు వెల్లడించారు. తారక్.. తన లక్కీ నంబర్ '9'తో ఉన్న కలిసున్న కారు నంబరును కొనుగోలు చేసేందుకు ఏకంగా రూ.17 లక్షలతో సొంతం చేసుకున్నారని అధికారి తెలిపారు.