తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పునీత్​ కోసం పాటపాడి ఎన్టీఆర్​ భావోద్వేగం - ఎన్టీఆర్ పునీత్ రాజ్​కుమార్ న్యూస్

Geleya Geleya NTR Song: కన్నడ పవర్​స్టార్ పునీత్​ను మరోసారి గుర్తుచేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. పునీత్ నటించిన 'చక్రవ్యూహ' చిత్రంలోని గెలయా సాంగ్​ను పాడారు. పునీత్ లేకుండా కర్ణాటక శూన్యంగా కనిపిస్తోందన్నారు.

Ntr sings geleya song for punith
పునీత్​ కోసం పాటపాడిన ఎన్టీఆర్​

By

Published : Dec 10, 2021, 7:13 PM IST

ఎన్టీఆర్

Geleya Geleya NTR Song: ఇటీవల గుండెపోటుతో మరణించిన కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్​పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు యంగ్​టైగర్ ఎన్టీఆర్. పునీత్ 'చక్రవ్యూహ' చిత్రంలో 'గెలయా గెలయా' అంటూ సాగే పాటను గతంలో స్వయంగా పాడారు. తాజాగా బెంగళూరులో నిర్వహించిన 'ఆర్​ఆర్​ఆర్​' ప్రెస్​మీట్​లో మరోసారి ఆ పాటను పాడి.. పునీత్​ను గుర్తుచేసుకున్నారు. కొంత భావోద్వేగానికి లోనయ్యారు. పునీత్ లేకుండా కర్ణాటక రాష్ట్రం.. తనకు శూన్యంగా కనిపిస్తోందన్నారు. పునీత్ ఎక్కడున్నా మనపై ఆయన దీవెనలు ఉంటాయన్నారు ఎన్టీఆర్​.

ప్రెస్​మీట్​కు ముందు పునీత్​కు నివాళులు అర్పించింది ఆర్​ఆర్​ఆర్​ చిత్రబృందం. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్​తోపాటు దర్శకధీరుడు రాజమౌళి, రామ్​చరణ్​, బాలీవుడ్ నటి అలియాభట్ పాల్గొన్నారు.

RRR Release Date: భారీ బడ్జెట్​తో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో ఈ సినిమా నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

ఇదీ చూడండి:RRR trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రికార్డుల మోత

ABOUT THE AUTHOR

...view details