తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR: ఎన్టీఆర్ పోస్టర్ ట్విట్టర్​లో రికార్డు - NTR RAMCHARAN RECORD

ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' పోస్టర్ ట్విట్టర్​లో రికార్డు సాధించింది. రెండు లక్షలకు పైగా కామెంట్లు సొంతం చేసుకున్న ఫస్ట్​లుక్​గా నిలిచింది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు 13 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.

NTR RRR POSTER TWITTER RECORD
ఎన్టీఆర్ పోస్టర్ ట్విట్టర్​లో రికార్డు

By

Published : Jul 3, 2021, 8:10 PM IST

Updated : Jul 3, 2021, 8:42 PM IST

స్టార్ హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటిస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్​ ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. ట్విట్టర్​లో రెండు లక్షల కామెంట్లు సొంతం చేసుకున్న ఫస్ట్​లుక్​గా నిలిచింది.

ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ పోస్టర్

ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చరణ్, తారక్.. బైక్​పై వెళ్తున్న ఫొటోను విడుదల చేశారు. అలానే ముందే చెప్పినట్లు అక్టోబరు 13నే సినిమాను తీసుకొస్తామని చిత్రబృందం పూర్తి స్పష్టతతో ఉంది!

ఈ సినిమాలో మెగాహీరో రామ్​చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. రాజమౌళి దర్శకుడు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్​తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ పోస్టర్

ఇవీ చదవండి:

Last Updated : Jul 3, 2021, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details