తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Ram charan Ntr RRR: 'ఆర్ఆర్ఆర్' కోసం చరణ్ తారక్ ఇలా.. - RRR ntr ram charan

RRR movie: ఆర్ఆర్ఆర్ సినిమాలోని రామ్​చరణ్, ఎన్టీఆర్ మేకోవర్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

Ram charan Ntr RRR
రామ్​చరణ్ ఎన్టీఆర్

By

Published : Dec 20, 2021, 7:54 PM IST

యావత్‌ సినీ ప్రపంచం ఎదురుచూస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా విడుదల సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఓ వైపు స్పెషల్‌ ఇంటర్వ్యూలు, వేడుకల్లో సినిమాపై అంచనాలు పెంచుతూ మరోవైపు కొత్త పోస్టర్లు, గ్లింప్స్‌లతో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి రెండు మేకింగ్‌ వీడియోలు చేరాయి.

ఎన్టీఆర్ కొమురం భీమ్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఇందులో చూడొచ్చు. బైక్‌ డ్రైవింగ్‌, అడవిలో పరిగెత్తే సన్నివేశాలు, కెమెరా వెనక మాస్క్‌ పెట్టుకుని ప్రాక్టీస్‌ చేసే దృశ్యాలు 'భీమ్' పాత్ర కోసం ఎన్టీఆర్‌ ఎంత కష్టపడ్డాడో తెలియజేస్తున్నాయి. త్వరలోనే రామ్‌ చరణ్‌ పాత్రకు సంబంధించిన మేకింగ్‌ వీడియో విడుదల కానుంది. అలానే అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం చరణ్ ఎలా సిద్ధమయ్యారో కూడా ఈ వీడియోలో చూపించారు.

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి నటించిన చిత్రమిది. రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఆలియాభట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే జనవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details