తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR movie: రాజమౌళికి తారక్​, చెర్రీ స్పెషల్​ విషెస్​ - rajamouli rrr movie trailer

నేడు(అక్టోబర్​ 10) దర్శకుడు రాజమౌళి పుట్టినరోజు(rajamouli birthday wishes) సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు హీరోలు ఎన్టీఆర్​, రామ్​చరణ్​, అజయ్​దేవగణ్​. 'ఆర్​ఆర్​ఆర్'​ షూటింగ్​ సెట్​లో జక్కన్నతో కలిగి దిగిన ఫొటోలను పోస్ట్​ చేశారు. అవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

RRR
ఆర్​ఆర్​ఆర్​

By

Published : Oct 10, 2021, 12:45 PM IST

దర్శకధీరుడు రాజమౌళి(rajamouli birthday wishes) పుట్టినరోజు నేడు(అక్టోబర్​ 10). ఈ సందర్భంగా అభిమానులు నుంచి సినీప్రముఖులు వరకు ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే హీరోలు ఎన్టీఆర్​, రామ్​చరణ్​, అజయ్​దేవగణ్ కూడా జక్కన్నకు​ స్పెషల్​ విషెస్​ తెలిపారు. తాము నటించిన 'ఆర్​ఆర్​ఆర్'(RRR movie) సినిమా షూటింగ్​ సెట్​లో రాజమౌళితో కలిసి దిగిన ఫొటోలను ట్వీట్​ చేశారు. అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

రాజమౌళి

"హ్యాపీ బర్త్​డే డియర్​ జక్కన్న. లవ్​ యూ"

-ఎన్టీఆర్​, హీరో(NTR RRR movie)

ఎన్టీఆర్​

"హ్యాపీ బర్త్​డే రాజమౌళి గారు. మీతో కలిసి పనిచేయడం, మీ దగ్గర నుంచి నేర్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనిది."

-అజయ్​ దేవగణ్​, బాలీవుడ్​ హీరో(ajay devgn rrr poster)

అజయ్​దేవగణ్​

"ఆయనను నేను చాలా గౌరవిస్తా. నిరాడంబరంగా ఉంటూ.. ఆయన ప్రదర్శించే ధైర్యాన్ని ఆరాధిస్తాను. హ్యాపీ బర్త్​డే రాజమౌళి గారు."

-రామ్​చరణ్​, హీరో(ramcharan rrr look)

రామ్​చరణ్​

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో (RRR Budget) 'ఆర్ఆర్ఆర్' (RRR release date) నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli RRR Movie Budget) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌(Ramcharan RRR New Look ), కొమురం భీమ్‌గా ఎన్టీఆర్​ (Ntr RRR Poster) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుందీ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఫస్ట్​ సింగిల్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చూడండి: ఆర్​ఆర్​ఆర్​ రిలీజ్​ డేట్​ ఫిక్స్​.. ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details